తెలంగాణ దసరా పండుగ అంటే ధూం ధాంగా చేసుకుంటుంటారు. చుక్కా ముక్కా పక్కాగా ఉండాల్సిందే. ఈ సంప్రదాయం తెలంగాణలో ఎప్పటి నుంచో వస్తోంది. మరోవైపు.. దసరా వచ్చిందంటే వాణిజ్య సంస్థలు కూడా గట్టిగానే ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే.. కొంతమంది యువత.. అటు తెలంగాణలో వచ్చే సంప్రదాయం ఉట్టిపడేలా.. అదిపోయే స్కీంను పెట్టారు. "రూ.100 కొట్టు మేక పట్టు" అనే కాన్సెప్ట్‌తో ఈసారి దసరా నిరుడు లెక్కుండది అనేలా వినూత్నమైన స్కీంను తీసుకొచ్చారు.