హైడ్రా బుల్డోజర్లు దూసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్ పెట్టిన హైడ్రా అధికారులు జలాశయం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే అనంతరం అటుగా బుల్డోజర్లు పంపేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు వాటి కూల్చివేతలకు సిద్ధమైనట్లు తెలిసింది.