దేశంలోనే 50 ఉత్తమ జిల్లాల్లో జనగామ జిల్లాకు చోటు దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక జిల్లా కూడా జనగామ మాత్రమే కావడం విశేషం. జనగామ జిల్లాకు దక్కిన ఈ ఘనత వెనుక ఉన్న కలెక్టర్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. జనగామ జిల్లా కలెక్టర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం గమనార్హం. ఇంతకీ జాతీయ స్థాయిలో జనగామ జిల్లాకు దక్కిన గౌరవం ఏంటి. ఏ విషయంలో జనగామ జిల్లా.. దేశంలోనే పేరు తెచ్చుకుంది. దాని వెనుక కలెక్టర్ పాత్ర ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.