ఈ మధ్య కాలంలో ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే 'ఫ్రెండ్లీ పోలీసింగ్' కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇలా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న పోలీస్ స్టేషన్లను కేంద్ర హోం శాఖ గుర్తిస్తోంది. అందులో భాగంగా తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణ నుంచి శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయగా.. 7వ స్థానంలో, తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్. ఈ ఘనత రావడానికి కృషి చేసిన శామీర్‌పేట్ పోలీసులను అందరు ప్రశంసిస్తున్నారు.