తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఈ రిఫైనరీని ప్రారంభించనున్నారు. మలేషియా సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా ముడి చమురును శుద్ధి చేసి నేరుగా వంట నూనెను ఉత్పత్తి చేయనున్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది.