"నా దైవం జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా...".. కడప కార్పొరేటర్ ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘట్టం

2 hours ago 2
కడప నగర పాలక సంస్థ కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. నగర పాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్ నుంచి వైసీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్ మద్దిక సంధ్యారాణి, సాధారణ పద్ధతికి భిన్నంగా తన పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పేరుపై ప్రమాణం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన కొత్త పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారుల సమక్షంలో కార్పొరేటర్లు వరుసగా ప్రమాణం చేశారు.
Read Entire Article