ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి.. వెలగపూడిలో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా తన జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అని నారా లోకేష్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక డీఎస్సీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని.. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచి.. ఆంధ్రప్రదేశ్‌ను విద్యారంగంలో ఆదర్శంగా నిలబెడతామని లోకేష్ హామీ ఇచ్చారు.