ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్‌ఫ్లూ పంజా విసిరింది. ప్రస్తుతం అనంతపురం జిల్లా సిద్దరాంపురంలోని ఓ ఫారంలో 2,500 కోళ్లు మృత్యవాతపడ్డాయి. నెల రోజుల వ్యవధిలో ఇన్ని కోళ్లు చనిపోయాయి. దీంతో సంబంధిత అధికారులు కోళ్లు బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆ గ్రామంలో బర్డ్‌ఫ్లూపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిఘా చర్యలను కూడా చేపట్టారు. ఎవరిలోనైనా శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు.