నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ సదవకాశం కల్పిస్తోంది. యూనియన్ బ్యాంక్‌కు చెందిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంత యువతకు వివిధ కోర్సులలో శిక్షణ అందించి.. వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ అవకాశం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకు మాత్రమే.. నెల రోజుల పాటు శిక్షణ అందించడంతో పాటుగా ఉచితంగా భోజన సదుపాయం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.