హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారే టార్గెట్‌గా తనిఖీలు చేపట్టనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా దొరికితే బండి సీజ్ చేయటంతో పాటు ఫైన్ కూడా విధించనున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ విధిగా దగ్గర ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.