ఆర్జీవీ గోడ దూకి పారిపోయాడు, దాక్కున్నాడు అంటూ మీడియానే కథలల్లుతోందని అసహనం వ్యక్తం చేశారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాను ఎక్కడికీ పారిపోలేదని.. డెన్‌లోనే ఉన్నానని, షూటింగ్‌లతో బిజీగా ఉన్నానన్నారు. ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన ట్వీట్లతో కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పుడు తన మీద కేసులు నమోదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే.. జైలుకెళ్లి, అక్కడ ఖైదీలతో పరిచయం పెంచుకొని, నాలుగు సినిమా కథలు రాసుకుంటానన్నారు. అలాగే తాను ఏ షూటింగ్‌కు వెళ్లానో ఎందుకు చెప్పాలని మీడియా ప్రతినిధితో వర్మ వాదనకు దిగారు. ఒకే పోస్ట్ ను కారణంగా చూపుతూ ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు అయ్యాయని.. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అనే అనుమానంతో నేను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్లు చెప్పారు. ఇంతవరకు పోలీసులు తనను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించలేదన్నారు.