ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పులివెందుల నియోజకవర్గం ప్రజల దాహార్తి తీరనుంది. పులివెందుల, పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే మెగా వాటర్ గ్రిడ్ పథకంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద రూ. 280 కోట్ల కేటాయింపులు చేశారు. దీంతో పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం వరకూ పూర్తయ్యాయి. నీటి శుద్ధి ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో 100 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు.