Yanam Pulasa Fish Prices Decreased: గోదావరిలో దొరికే పులస చేపల ధరలు తగ్గాయి.. సీజన్ ముగింపు దశకు రావడంతో సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కొద్దిరోజులుగా పులస చేపల ధరలు రూ.500 నుంచి రూ.1200 వరకు పలుకుతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి 30 వేల వరకు పలికిన పులస చేపల ధరలు ఇప్పుడు రూ.1200 వరకు పలుకుతున్నాయి. ఇటు చీరమేనుల ధర మాత్రం పెరిగింది. చీరమేనుల ధరలు తగ్గితే పులస చేపల ధరలు పెరుగుతాయంటున్నారు.