మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది. వారం రోజుల పాటు మొత్తం 500 మంది సిబ్బంది 828 హుండీలను లెక్కించారు. అయితే ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయం మాత్రం రాకపోవడం గమనార్హం. ఈసారి మేడారంలో దాదాపు 300 అదనపు హుండీలు ఏర్పాటు చేసి.. రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావించగా.. అందులో సగం కూడా రాలేదని వెల్లడించారు. ఇక వచ్చిన ఆదాయంలో 33 శాతం మేడారం పూజారులకు అందించాల్సి ఉంటుంది.