తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదును గతంలో ఉన్న ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నప్పుడు ఈ పెంచిన నగదు నేరుగా భార్య ఖాతాలో జమ అవుతుంది. దీనితో పాటు సుమారు 50 కోట్ల రూపాయలతో కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సామాజిక భద్రత కల్పిస్తూనే, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.