పోలీస్ అధికారులపై అవినీతి కేసులు క్లోజ్.. ఏసీబీ విజ్ఞప్తికి నాంపల్లి కోర్టు ఆమోదం

1 hour ago 1
తెలంగాణలో పోలీసు అధికారులకు సంబంధించిన రెండు అవినీతి కేసుల మూసివేత నివేదికలను నాంపల్లి ఏసీబీ కోర్టు ఇటీవల ఆమోదించింది. 2019లో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్పీ స్థాయి అధికారిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మరో కేసులో పబ్‌ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, హోంగార్డుపై కేసు నమోదైంది. ఈ కేసులోనూ శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం మొగ్గుచూపింది. కాగా.. 2023 నుంచి సుమారు 22 ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు మూసివేయటం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article