టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామంది ఏడాదికో లేదంటే రెండు సంవత్సరాలకో ఒక సినిమాతో కనిపించడం చూస్తుంటాం. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ఆ ట్రెండ్‌ను మార్చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఏడాదికి రెండు లేదా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నాడు.