రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమెరికాలో ఉచితంగా ట్రైనింగ్ అందించనున్నారు. దాదాపు 6 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సమయంలో వారికి ప్రభుత్వం నుంచి జీతం అందడమే కాకుండా.. ఖర్చులన్నీ అమెరికా ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో స్కిల్స్ అందించేందుకు ఈ అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ ప్రోగ్రామ్ కింద అమెరికాకు వెళ్లేవారికి.. కొన్ని అర్హతలు ఉండాలని సూచించారు.