హైదరాబాద్ NH65 BHEL జంక్షన్ ఫ్లైఓవర్ కింద రోడ్డు కుంగిపోవడంతో వాహనదారుల్లో భయాందోళన నెలకొంది. చందానగర్ - మాదినాగుడ అండర్‌పాస్ వద్ద ఈ సమస్య తలెత్తింది. నెటిజన్ల ఫిర్యాదుతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించి.. అధికారులకు సమాచారం అందించారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు.