ఫేస్‌బుక్‌లో అయిన పరిచయం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిండా ముంచింది. ఏకంగా రూ.2.36 కోట్లు మోసపోయిన ఆ టెకీ.. ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. మహిళ పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి.. ఆమెతో చాటింగ్ చేసిన ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. నిలువునా మోసపోయాడు. ఫేస్‌బుక్‌లో కొనుగోళ్లు, అమ్మకాలతో భారీగా లాభాలు వస్తాయని చెప్పిన విషయం నమ్మి.. కోట్ల రూపాయల డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసి.. సైబర్ క్రైమ్ బాధితుడిగా మిగిలాడు.