PhonePe fraud Ongole: ఒంగోలు సమీపంలో ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. ఫోన్‌పే ద్వారా రూ.90 వేలు మోసం చేసిన యువకుడు, తాను పట్టుబడతానని భయపడి రన్నింగ్ బస్సు నుంచి దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.