వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో గురవారం (జులై 10) నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. 9999 ఫ్యాన్సీ నెంబర్‌కు అత్యధిక ధర పలికింది. ఓ వాహనదారుడు ఆ నెంబర్‌ను రూ. 11 లక్షలకు సొంతం చేసుకున్నాడు.