బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానళ్లలో ప్రసారం చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసేలా సోషల్ మీడియాలో, కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని.. దీన్ని అడ్డుకోవాలంటూ భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో కూడా ప్రచురించకూడదు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.