వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తి వివాదం కీలక మలుపు తిరిగింది. గత నెలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. బిగ్ ఎక్స్పోజ్ అంటూ ఉదయం నుంచి హడావిడి చేసిన టీడీపీ.. వైఎస్ కుటుంబం ఆస్తి వివాదంపై ట్వీట్ చేసింది. వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న ఈ లేఖలో.. అనేక అంశాలను ప్రస్తావించారు. అలాగే వైఎస్ జగన్కు అనేక ప్రశ్నలు సంధించారు. మరి దీనికి వైసీపీ, వైఎస్ జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేదీ చూడాలి.