దక్షిణాది అయోధ్య గుర్తింపు పొందిన భద్రాచలం ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కొలువుదీరారు. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న నిర్మించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారికి నిత్య క్రతువులు, అభిషేకాలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇక, ఏటా చైత్రశుద్ధ నవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి లక్షల్లో భక్తులు హాజరవుతారు.