భాగ్యనగరంలో దుర్గామాత ఊరేగింపుపై గుడ్డు విసిరిన దుండగులు.. పోలీసుల అదుపులో అనుమానితులు

1 hour ago 2
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుర్గా మాత విగ్రహం ఊరేగింపుపై దుండగులు కోడి గుడ్డుతో దాడి చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందగానే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఊరేగింపు నిర్వాహకులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానంతో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article