భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మరో అడుగు.. రూ.200 కోట్లతో NIUM క్యాంపస్

1 hour ago 1
భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది. 2028 జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలో నూతన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను కూడా ప్రారంభించారు.
Read Entire Article