Visakhapatnam Temporary Lounges For Airport Passengers: విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే విమాన ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. నగరంలో ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం వేచి ఉండేందుకు రెండు తాత్కాలిక లాంజ్‌లను ఏర్పాటు చేశారు. బీచ్‌రోడ్డు వీఎంఆర్‌డీఏ పార్కు దగ్గర విమాన ప్రయాణికులు జీసీసీ కాఫీ షాపులో కూర్చునేలా లాంజ్ ఏర్పాటు చేశారు. రుషికొండలో సాయిప్రియా రిసార్ట్స్‌లో నూ ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి నగరంలో 9చోట్ల లాంజ్‌లు ప్రతిపాదించినా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు.