మల్టీ మోడల్‌ హబ్‌లుగా MMTS స్టేషన్లు.. మెట్రో, బస్సులు, రైళ్లు ఇక ఒకే చోట..!

1 hour ago 1
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ పరిధిలోని 51 స్టేషన్లను ఆధునిక మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మెట్రో, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టాక్సీలు, ఫీడర్‌ సేవలను ఎంఎంటీఎస్‌తో అనుసంధానించనున్నారు. ప్రతి స్టేషన్‌కు డీపీఆర్‌, స్టేషన్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ రూపొందించేందుకు కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఫుట్‌పాత్‌లు, కవర్డ్‌ వాక్‌వేలు, పార్కింగ్‌, పిక్‌అప్‌-డ్రాప్‌ జోన్లు, బస్‌బేలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సమీకృత ప్రణాళికతో లాస్ట్‌-మైల్‌ కనెక్టివిటీ మెరుగుపడి, ఎంఎంటీఎస్‌ రైడర్‌షిప్‌ పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article