మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మే నెలలో 4.62 కోట్ల మీటర్లకు ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటికే 1.74 కోట్ల మీటర్ల ఉత్పత్తి పూర్తయింది. ఈసారి నీలం స్థానంలో చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించగా.. రూ.142 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. సెప్టెంబరు 20లోగా ఉత్పత్తి పూర్తి చేసి అక్టోబరులో పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏకరూప దుస్తుల మిగిలిన వస్త్రాన్ని కూడా టెస్కో సేకరిస్తోంది.