మహిళా సంఘాలకు బిగ్‌ బూస్ట్‌.. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు రెడీ

1 hour ago 1
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు శాశ్వత మౌలిక వసతులు కల్పించేందుకు నిర్మిస్తున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.110 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనాల్లో శిక్షణ, సమావేశాలు, వ్యాపారాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 12 భవనాలు పూర్తయ్యాయి. మరో ఎనిమిది ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన రెండు నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు.
Read Entire Article