మహిళా సంఘాలతో కొత్త వ్యాపారం.. మిల్లెట్ కేఫ్‌లు ఏర్పాటు, తొలి విడతలో ఐదు కేంద్రాలు!

1 hour ago 1
తెలంగాణలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మిల్లెట్‌ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో మూడు, మహబూబ్‌నగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు కేఫ్‌లను ప్రారంభించనున్నారు. ఒక్కో కేఫ్‌కు రూ.2.2 కోట్ల చొప్పున మొత్తం రూ.11 కోట్లు వెచ్చించనున్నారు. ఐఐఎంఆర్‌ ఆధ్వర్యంలో 40 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. నవంబరు 19న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడంతో పాటు మహిళలకు ఆదాయ మార్గాలు సృష్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
Read Entire Article