మాది లవ్ జిహాద్ కాదు.. పెళ్లి చేసుకున్న మోనాలిసా !

2 hours ago 3
ప్రయాగ్‌రాజ్ గడ్డపై జరిగిన మహా కుంభమేళాలో లక్షలాది మంది భక్తుల మధ్య, చిందరవందరగా ఉన్న జుట్టు.. సాదాసీదా దుస్తులతో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముతూ కనిపించిన ఆ అమ్మాయి అందరికీ గుర్తే ఉంటుంది. తన నీలి రంగు కళ్లతో, అమాయకపు చూపులతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా ప్రపంచాన్ని షేక్ చేసిన ఆ సెన్సేషన్ పేరే మోనాలిసా భోంస్లే. కేవలం ఒక్క వీడియోతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ మధ్యప్రదేశ్ యువతి, ఆ తర్వాత హీరోయిన్‌గా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు అదే మోనాలిసా తన పెళ్లి వార్తతో మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article