Unni Mukundan Marco telugu review : మలయాళీ చిత్రాల సంప్రదాయానికి భిన్నంగా "మార్కో" ఉందనే చెప్పాలి. సాధారణంగా మలయాళ సినిమాలు సున్నితమైన కధనాలతో ఉంటాయి. కానీ "మార్కో" ఆ ట్రెండ్‌కు విరుద్ధంగా ఒక పూర్తి యాక్షన్ డ్రామాగా సాగింది. ఇటీవలి "యానిమల్", "కిల్" చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో హింస మరింత తీవ్రంగా ఉంటుందనే చెప్పోచ్చు.