దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేల్లో మౌలికసదుపాయాలను మెరుగుపరుస్తూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో పాటు అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ల పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగానే చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. తాజాగా, సికింద్రాబాద్ స్కీమ్‌లో భాగంగా దానికి కూతవేటు దూరంలోని మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్‌లో పనులు కూడా మొదలయ్యాయి.