తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలికి, ఈవో, ఏఈవోలకు మధ్య గ్యాప్ ఉందంటున్నారన్నారు పవన్ కళ్యాణ్. వీటిని సరిచేసుకోవాలి. జనాలను సమర్థంగా నియంత్రించడంలో టీటీడీకి ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్నాయన్నారు. పర్యవేక్షించే వ్యక్తులకే సరైన ప్రణాళిక లేదని.. పోయిన ప్రాణాలు తీసుకురాలేం.. అయ్యిన గాయాలు మాన్పలేమన్నారు. భైరాగిపట్టెడ చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలకు దగ్గరగా ఉందని.. టోకెన్లు జారీచేసే ప్రదేశం విశాలంగా ఉంటుందని మహిళా భక్తులు ఎక్కువమంది వచ్చి నలిగిపోయారన్నారు. బాధ్యులైన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.