ఓ భూ వివాదం పరిష్కారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను మెదక్ జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. భూమి పంచాయితీలో ఇరు పక్షాలకు నోటీసుల పంపి వివాదాన్ని పరిష్కరించాలని కోర్టు గతంలో ఆదేశించిగా.. కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల ఫైన్ విధించారు.