సమ్మక్క - సారలమ్మ మందిరాన్ని రాతితో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని.. వంద రోజుల్లో ఈ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మేడారం జాతరను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గద్దెలను పునరుద్ధరించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే.. ఆదివాసీలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి వారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం వచ్చి పనులను పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించారు.