మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. గోడకు కన్నమేసి జ్యువెలరీ షాపులో ఆభరణాలు అపహరణ

3 hours ago 2
మేడ్చల్‌లో పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక గది గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించి వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు. ఉదయం యజమాని కుమారుడు చోరీని గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇదే దుకాణంలో చోరీ జరిగినట్లు తెలిసింది. దీంతో స్థానిక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. దొంగల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Entire Article