తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ ‘స్కై వారియర్స్’గా మారారు. వారి ఈ కృషిని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. 50 ఎకరాలకు పైగా పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారని.. దీనివల్ల ఎండ, రసాయనాల ప్రమాదం తగ్గి పని సమర్థత పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని పంచుకుంటూ.. మోదీ ప్రభుత్వం నారీ శక్తి సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఆవిష్కరణ గ్రామీణ మహిళల సాధికారతకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.