ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక హెచ్చరికలు చేశారు. రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని హితవు పలికారు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్ కొరత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను యాసంగిలో సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం కూడా అధికమైందని తెలిపారు. అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులపై కేబినెట్ సబ్కమిటీ, నోడల్ అధికారి ద్వారా సమీక్షలు నిర్వహించడంతో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.