రంజాన్ మాసంలో హలీం తయారు చేసే వంట మాస్టర్లు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. నెలకు రూ.2.50 లక్షలు సంపాదిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రముఖ హోటళ్ల నిర్వహకాలు వీరిని నియమించుకుంటుండగా.. పండగ తర్వాత కూడా వీరికి చేతి నిండా పని దొరుకుతుంది. దీంతో చాలా మంది హలీం, బిర్యానీ వంటి వంటలు నేర్చుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు.