టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు అయ్యింది. రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చి, కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించిన బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్లంకొండ రాంగ్ రూట్ లో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.