ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మరో చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించారు. రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించారు. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వారా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర ట్రైలర్‌ను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు.