Game Changer Review : తెలుగువారికి సంక్రాంతి చాలా పెద్ద పండుగ.. అలాంటి పండుగకు ఓ సినిమా వస్తుందంటే.. భారీ అంచనాలుంటాయి. అంతేకాదు టాలీవుడ్ నుంచి విడుదలైన భారీ పాన్-ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్”. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.. మరీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.