తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం ఎలైన్‌మెంట్ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఉత్తర భాగాన్ని భారతమాల పరియోజన కింద ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుండగా.. దక్షిణ భాగాన్నీ ఏదైనా కేంద్ర పథకంలో చేర్చి సమాంతరంగా నిర్మించాలని రాష్ట్రం కోరుతోంది. యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ. ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దక్షిణ భాగాన్ని ప్రతిపాదించారు. ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్లే ఈ మార్గం ఏడు జిల్లాల్లోని 55 ప్రాంతాలను కలుపుతుంది. సుమారు 2,010 హెక్టార్ల భూసేకరణ అవసరంగా ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతానికి ఎలాంటి పురోగతి లేదు.