Centre No to 8 Lane Regional Ring Road: రీజినల్ రింగు రోడ్డును 8 వరుసలకు బదులు 6 వరుసలతోనే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2047 వరకు ట్రాఫిక్ రద్దీకి ఈ 6 వరుసలు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. 2 వరుసలను తగ్గించడంతో.. నిర్మాణ వ్యయం కూడా భారీగా తగ్గుతుంది. భవిష్యత్తులో అవసరమైతే, సెంట్రల్ మీడియన్‌ను తగ్గించి 8 వరుసలకు విస్తరించే అవకాశం ఉంది. ఆరు వరసలకు గాను భూసేకరణతో కలిపి మొత్తం రూ.16 వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.