Paderu Agency Coffee Cultivation Expansion: పాడేరు ఏజెన్సీలో కాఫీ సాగును రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాలకు విస్తరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనతో, 2031 నాటికి రాష్ట్రాన్ని దేశంలో కాఫీ సాగులో రెండో స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. షేడ్ ప్లాంటేషన్ విధానంలో సాగును ప్రోత్సహిస్తూ, రైతులకు ఉచిత మొక్కలు, శిక్షణ అందిస్తారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది.