పుష్ప సినిమాను మించి గంజాయి స్మగ్లింగ్ చేశాడు. కొన్నేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా రూ. కోట్లు సంపాదించాడు. వ్యవసాయం లాభసాటిగా లేదనుకుని గంజాయి స్మగ్లింగ్‌లోకి దిగాడు ఓ రైతు. ఉన్న ఊరు నుంచి దూరం వచ్చి.. కొందరుడ్రైవర్లతో ఒప్పందం చేసుకుని.. గంజాయి సరిహద్దులు దాటించే పని మొదలుపెట్టాడు. పోలీసుల తనిఖీలు తప్పించుకునేలా వాహనాల రిజిస్ట్రేషన్లు చేశాడు. పుష్ప సినిమాలోలా.. లారీల కింద రహస్య అరలు ఏర్పాటు చేసి గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించేవాడు. చివరికి పోలీసులు అడ్డంగా దొరికిపోయాడు.