త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎమ్మల్సీ ప్రొ. కోదండరాంకు చోటు దక్కనుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే.. స్పందించిన కోదండరాం.. తనకు కేబినెట్‌లో చోటు అనేది ఊహాగానమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి అనేది తనకు అదనపు బాధ్యతనే అని.. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.